Damodar Rajanarsimha : అర్హులకే సంక్షేమ పథకాలు అందించాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

by Y. Venkata Narasimha Reddy |

రాష్ట్ర ప్రభుత్వం(State Government)కొత్తగా అమలు చేయబోయే నాలుగు సంక్షేమ పథకాల(Welfare Schemes)ను పారదర్శకంగా అమలు చేసి..నిజమైన అర్హులకు అందించేలా చర్యలు తీసుకోవాలని మహాబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha)అధికారులకు సూచించారు.

Damodar Rajanarsimha : అర్హులకే సంక్షేమ పథకాలు అందించాలి: మంత్రి దామోదర రాజనర్సింహ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(State Government)కొత్తగా అమలు చేయబోయే నాలుగు సంక్షేమ పథకాల(Welfare Schemes)ను పారదర్శకంగా అమలు చేసి..నిజమైన అర్హులకు అందించేలా చర్యలు తీసుకోవాలని మహాబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha)అధికారులకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలుపై మహబూబ్ నగర్(Mahabubnagar)జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమన్వయ సమావేశంను రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు లు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందిరమ్మ కమిటీలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ సభలో పాల్గొని క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలన్నారు. తాను ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో రెండు గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు.

ఈ సమన్వయ సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, శాసన సభ్యులు జాన పల్లి అనిరుధ్ రెడ్డి, జి.మధు సూదన్ రెడ్డి, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, వాకిటి శ్రీ హరి, మేఘా రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, స్పెషల్ ఆఫీసర్ జి.రవి నాయక్, జిల్లా కలెక్టర్ లు విజయేందిర బోయి(మహబూబ్ నగర్), బదావత్ సంతోష్(నాగర్ కర్నూల్), బీ.ఎం.సంతోష్ (గద్వాల), ఆదర్శ్ సురభి (వన పర్తి), అదనపు కలెక్టర్ లు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Next Story