- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చర్లపల్లి టు తిరుపతి.. హైదరాబాదీల కోసం వీక్లీ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి - తిరుపతి మధ్య రెగ్యులర్, వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్తరైలు నల్గొండ - కడప రూట్ లో ప్రయాణిస్తుందని తెలిపింది. ఇప్పటి వరకూ హైదరాబాద్ నుంచి తిరుపతికి పద్మావతి ఎక్స్ ప్రెస్ , వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, నారాయణాద్రి ఎక్స్ ప్రెస్, వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ప్రవేశ పెట్టనున్న రైలు.. ఇప్పటికే ఉన్న రైళ్లకు ప్రత్యామ్నాయంగా రానుంది. ఈ సర్వీస్ ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ చర్లపల్లి టు తిరుపతి రూట్ లో స్పెషల్ ట్రైన్ గా నడిచిన సర్వీసునే ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ గా కొనసాగించనున్నారు.
ప్రతీ గురువారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మర్నాడు ఉదయం 8.25 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది. చర్లపల్లి నుంచి ఇదే ట్రైన్ ప్రతీ శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు బయల్దేరి బీబీ నగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా శనివారం ఉదయం 7.30 గంటలకు తిరుపతికి చేరుకోనుంది. చర్లపల్లి నుంచి ఈనెల 29వ తేదీ నుంచి వీక్లీ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి రానుంది.






