- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీకెండ్‌లో మందుబాబుల జోరు.. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ యువత
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన 'వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్' తనిఖీల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన 'వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్' తనిఖీల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. జనవరి 16 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ దాడుల్లో మొత్తం 231 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.
టూ వీలర్లే అత్యధిక..
పోలీసులు వెల్లడించిన గణాంకాల ప్రకారం, పట్టుబడిన వాహనాల్లో ద్విచక్ర వాహనాలే అత్యధికంగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు (2 Wheelers) 187 మందిపై కేసులు, కార్లు (4 Wheelers) 29 కేసులు, ఆటోలు (3 Wheelers) 15 కేసులు నమోదు అయ్యాయి.
యువతపైనే మద్యం ప్రభావం!
ఈ తనిఖీల్లో పట్టుబడిన వారి వయస్సును గమనిస్తే ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే మద్యం మత్తులో ఎక్కువగా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. 21-30 ఏళ్ల లోపు వారు 92 మంది, 31-40 ఏళ్ల లోపు వారు 88 మంది ఉండటం గమనార్హం. అలాగే 18 ఏళ్ల లోపు ఉన్న ఒక మైనర్‌పై కూడా కేసు నమోదైంది.
ఏరియాల వారీగా తనిఖీలు
అత్యధికంగా కూకట్‌పల్లి (35), మియాపూర్ (29), పటాన్‌చెరు (29), ఆర్సీపురం (22), గచ్చిబౌలి (21) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఆల్కహాల్ శాతం (BAC) పరీక్షించగా, 12 మందిలో 300 కంటే ఎక్కువ పాయింట్లు నమోదవ్వడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.






