- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేతి సంచిపై పెళ్లి పత్రిక.. పర్యావరణ ప్రేమికుడి ఆలోచన అదుర్స్
మారుతున్న కాలానికి అనుకూలంగా పెళ్లి పత్రికలను వివిధ రకాలలో ముద్రించుకోవడానికి ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధపడుతున్నారు.

దిశ, బిచ్కుంద : మారుతున్న కాలానికి అనుకూలంగా పెళ్లి పత్రికలను వివిధ రకాలలో ముద్రించుకోవడానికి ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఓ ప్రకృతి ప్రేమికుడు వినూత్నంగా తమ కుమారుడి వివాహానికి చేతి సంచిపై పెళ్లి పత్రికను ముద్రించి పంపిణీ చేయడం ఆలోచింపజేసింది. పర్యావరణ హితమైన చేతి సంచిని వాడండి ప్లాస్టిక్‌ని నివారించండి అంటూ సందేశం తెలియజేశారు.
కాగా దీనిపై స్పందించిన పర్యావరణ జిల్లా కమిటీ అధ్యక్షులు భాను దాస్ కులకర్ణి మాట్లాడుతూ.. చేతి సంచిపై పెళ్లి పత్రికలు ముద్రించి పంపిణీ చేయడం చాలా మంచి ఆలోచన అన్నారు. ఈ ఆలోచనతో ప్లాస్టిక్ నివారంచవచ్చన్నారు. అలాగే పెళ్లిలో జరిగే భోజన కార్యక్రమానికి ఉపయోగించే ప్లాస్టిక్ ప్లేట్లు కాకుండా మోదుగ ఆకులతో చేసిన ఇస్తర్లను వాడినట్లయితే సాంప్రదాయమైన పద్ధతిలో భోజనం పెట్టడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసిన వారవుతామని ఆయన అన్నారు.






