- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మారిన వాతావరణం.. గంటన్నరలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల 2 గంటల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన తీవ్రమైన తుఫానులు వచ్చే అవకాశం ఉంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా అల్లాడిపోయిన ప్రజలను ఆశ్చర్యపరుస్తూ నల్లని మేఘాలు తెలంగాణను కమ్మేశాయి. ఒక్కసారిగా మారిన వాతావరణం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్రమైన తుఫానులు (Intense Thunderstorms) ఏర్పడటం ప్రారంభమైందని వాతావరణ విశ్లేషకులు హెచ్చరించారు. రాబోయే రెండు గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
ప్రధానంగా నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి (మహేశ్వరం, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు), సంగారెడ్డి (జహీరాబాద్), మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన తుఫానులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో రాగల రెండు గంటల్లో అక్కడక్కడా మోస్తరు తుఫానులు/వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక భాగ్యనగరం విషయానికి వస్తే.. దక్షిణ హైదరాబాద్ (South Hyderabad) పరిధిలోని ఇబ్రహీంపట్నం, బాలాపూర్, శంషాబాద్ వైపు రాబోయే గంట వ్యవధిలో ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమై, ఆ తర్వాత నగరంలోని మరికొన్ని దక్షిణ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈ హఠాత్ పరిణామంతో ప్రజలు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని సూచించారు.






