- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బలహీనపడిన అల్పపీడనం.. నేడు, రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయాన్నే ఎండలు మండి పోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్‌డేట్ ఇచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో తేమ గాలులు వీస్తాయి. తెలంగాణలో భిన్నమైన వాతావరణం నెలకొంది. పలు చోట్ల ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నేడు(శనివారం), రేపు(ఆదివారం) తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే ఆదిలాబాద్, హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, గద్వాల, నారాయణపేట, నిజామాబాద్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.






