కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు చెబుతాం.. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

by Kema Shiva Kumar |

అసెంబ్లీ (Assembly) సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు చెబుతాం.. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly) సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార, విపక్ష సభ్యులు అస్ట్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. సభలో రేవంత్ సర్కార్ జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం నివేదిక (Kaleshwaram Report)ను ప్రవేశపెట్టి.. చర్చించేందుకు సన్నద్ధమవుతోంది. అయితే, వారు చేసే అరోపణలను తిప్పికొట్టేందుకు గులాబీ దళం ఓ రేంజ్‌లో ప్రిపేర్ అవుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR)తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంపై బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీపై ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణం, సాంకేతిక అంశాలపై అసెంబ్లీలో వివరిస్తామని తెలిపారు. ప్రజెటేషన్‌కు స్పీకర్ అవకాశం ఇస్తారని అనుకుంటున్నామని అన్నారు. ఏదో మేడిగడ్డ బ్యారేజీ రెండు పిల్లర్లు కుంగినంత మాత్రానా.. కాళేశ్వరం కూలిపోయిందని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కమిషన్ ఇచ్చిన నివేదిక సీల్డ్ కవర్‌లోనే ఉండగా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సభలో మాకు అవకాశం ఇస్తే.. అసలు నిజాలను బయటపెడతామని అన్నారు. అధికార పక్షానికి దమ్ముంటే.. హరీశ్ రావుకు వాస్తవాలను వివరించే ఛాన్స్ ఇవ్వాలని సవాల్ విసిరారు. బనకచర్ల ద్వారా గోదావరి నీళ్లను తరలించే కుట్రలు జరగుతున్నాయని.. రేవంత్ సర్కార్ మొద్దు నద్ర వీడటం లేదని ప్రశాంత్ రెడ్డి కామెంట్ చేశారు.

Next Story