- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhatti : అటవీ సంపద హక్కులను పక్కాగా అమలు చేస్తాం : భట్టి
అటవీ సంపద(Forest Rights)లో ఆదివాసీ, గిరిజనులకు అన్ని హక్కులు ఇందిరమ్మ రాజ్యం(Indiramma State) లో అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : అటవీ సంపద(Forest Rights)లో ఆదివాసీ, గిరిజనులకు అన్ని హక్కులు ఇందిరమ్మ రాజ్యం(Indiramma State) లో అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లో నిర్వహించిన ఆదివాసీ, గిరిజన ప్రజా ప్రతినిధుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశాకి ఆయన మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(N.Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy)లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భగా భట్టి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం కోసం వెనుకడుగు వేయని ధీరోదాత్తులు ఆదివాసీలు, గిరిజనులని కొనియాడారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో హక్కులు కాదు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయామని గ్రహించిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చారన్నారు. గిరిజనుల కోసం తెచ్చిన పీసా, అటవీ హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తాయన్నారు. ఐటీడీఏలకు పునర్జీవం కల్పిస్తామని, కావలసిన బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు.
గిరిజన నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధిని కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ & మైనార్టీ కో ఆర్డినేటర్ కొప్పుల రాజు, ఎమ్మెల్యేలు బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.






