ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తాం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేసి రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తాం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేసి రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. 2026లో ప్రజలకు చక్కని వైద్యం అందేలా చూస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2026లో నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్‌ నివారణ, నియంత్రణ, చికిత్స, పాలియేటివ్ కేర్‌పై మరింత ఫోకస్ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఎన్‌సీడీసీ క్లినిక్స్, డే కేర్ కేన్సర్ క్లినిక్స్ ద్వారా గ్రామాల సమీపంలోకి వైద్య సేవలను తీసుకెళ్లామని మంత్రి గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌ను విస్తృతం చేస్తున్నామని, 2026లో రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా క్రిటికల్ కేర్ బ్లాక్స్, ట్రామా కేర్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొస్తామని‌ మంత్రి తెలిపారు. పది నిమిషాల్లోనే ఘటన‌ స్థలానికి చేరుకుని వైద్య సేవలు ప్రారంభించేలా "108 అంబులెన్స్" సర్వీసెస్‌ను ఎక్స్‌పాండ్‌ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

దశాబ్దాల ఉస్మానియా నూతన హాస్పిటల్‌ ఆకాంక్షను 2025లో నెరవేర్చుకున్నామని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లకు కొత్త భవనాలను నిర్మించుకున్నామన్నారు. 2026లో 4 కొత్త మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. గుండె, కిడ్నీ జబ్బులు, కేన్సర్ వంటి మొండి వ్యాధులకు సైతం పేదలు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం పొందేలా ఈ హాస్పిటళ్లను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చి వైద్య విద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. బీపీ, షుగర్, ఒబెసిటీ, కిడ్నీ, గుండె జబ్బులు, కేన్సర్లకు కారణమైతున్న అనారోగ్యకర అలవాట్లను మానుకోవాలని, కొత్త సంవత్సరంలో ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని మంత్రి సూచించారు.

Next Story