- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ తల్లి విగ్రహాలను సకల మర్యాదలతో గాంధీభవన్‌కు పంపుతాం.. ఎమ్మెల్సీ కవిత సెన్సేషనల్ ట్వీట్
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వం నూతనంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాలను రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఆవరణలో ప్రతిష్టించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది. ఈ క్రమంలోనే కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ తల్లి విగ్రహాల ఏర్పాటుపై తెలంగాణ జాగృతి చీఫ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యతంరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలు ఊరూరా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ తల్లిని ప్రజలపై రుద్దే కుట్రకు ఈ అరాచక ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు.
తెలంగాణ అస్తిత్వ చిహ్నమైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి వేరు చేసి రేవంత్ సర్కార్ రూపొందించిన కాంగ్రెస్ తల్లిని అన్ని జిల్లాల కలెక్టరేట్ ప్రాంగణాల్లో ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అధికారం ఉంది కదా.. అని తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ తల్లి విగ్రహాలు ఎక్కువ రోజలు నిలబడవని ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని అన్నారు. ముమ్మాటికీ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. మీ కాంగ్రెస్ తల్లి విగ్రహాలను సకల మర్యాదలతో గాంధీభవన్‌కు పంపిస్తామని కవిత ట్వీట్ చేశారు.






