- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూప్-1 విషయంలో హైకోర్టు తీర్పును గౌరవిస్తాం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
గ్రూప్-1 మూల్యాంకనం, ర్యాంకింగ్ మెరిట్ లిస్ట్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 మూల్యాంకనం, ర్యాంకింగ్ మెరిట్ లిస్ట్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను ఉన్నత ధర్మాసనం రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రీ కరక్షన్ చేపట్టాలని, 8 నెలల్లోపు ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు టీజీపీఎస్సీ (TGPSC)కి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే గ్రూప్-1 అంశంపై తాజాగా, మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) స్పందించారు. ఇవాళ గాంధీభవన్ (Gandhi Bhavan)లో మంత్రుల ముఖాముఖి కార్యాక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని స్పష్టం చేశారు. కోర్టు తీర్పును పరిశీలించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
పదేళ్లు గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేని అసమర్థత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. చర్లపల్లిలోని డ్రగ్స్ కేసులో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా ముఖాముఖి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఎక్కువ మంది ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ధరణి సమస్యలు, పాస్ పుస్తకాల ఇష్యూపై ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు.
Read More: KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు






