- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూన్ 2న రూ.1000 కోట్లు విడుదల చేస్తాం : భట్టి విక్రమార్క
by Muthe.Rajitha |
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో గుడ్ న్యూస్ వినిపించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో గుడ్ న్యూస్ వినిపించారు. రాజీవ్ యువ వికాస పథకానికి నిధులు విడుదలపై అచ్చంపేట వేదికగా శుభవార్త వినిపించారు. నేడు నగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయిన "ఇందిరా జల వికాస" కార్యక్రమానికి హాజరైన భట్టి.. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాస పథకానికి జూన్ 2న రూ.1000 కోట్ల నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అని.. ఇందిరమ్మ రాజ్యాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని ఆయన ఈ మేరకు ప్రజలకు పిలుపునిచ్చారు.
Next Story






