- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్లమెంట్ లో తెలంగాణ సమస్యలను ప్రస్థావిస్తాం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వింటర్ సెషన్ లో తెలంగాణ రాష్ట్ర సమస్యలు, దేశ వ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యలపైన పార్లమెంట్ లో బలంగా గొంతు వినిపిస్తామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వింటర్ సెషన్ లో తెలంగాణ రాష్ట్ర సమస్యలు, దేశ వ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యలపైన పార్లమెంట్ లో బలంగా గొంతు వినిపిస్తామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన అంశాలైన రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, మూసీ రీజువెనేషన్, పట్టణ స్థానిక సంస్థలకు అర్బన్ చాలెంజ్ ఫండ్, కొత్త రైల్వే మార్గాల ఆమోదాలు, వరంగల్, కొతగూడెం, పెదపల్లి విమానాశ్రయ అనుమతులపైన పార్లమెంట్ మాట్లాడుతామన్నారు. అలాగే రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక అనుమతులను కూడా డిమాండ్ చేస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఈ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలకు కీలకమైన అంశాలు కూడా లేవనెత్తుతామని వాటిల్లో ఈసీ చేపడుతున్న ఓటర్ లిస్ట్‌ల ఎస్ఐఆర్ లో లోపాలు, రాజకీయ జోక్యం, పెరుగుతున్న నిరుద్యోగం, ఢిల్లీ–ఎన్సీఆర్ విపరీత కాలుష్యం, ఇటీవల ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్, నేషనల్ హెరాల్డ్ కేసు ఎఫ్ఐఆర్ ల పైన మాట్లాడుతామన్నారు. విదేశాంగ విషయాల్లో ట్రంప్ చేసిన ఇండియా–పాకిస్థాన్ మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు, ఇండియా–యూఎస్ ట్రేడ్ చర్చలు, చైనా సంబంధిత అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తెచ్చిన కొన్ని బిల్లులపై కూడా తీవ్ర ఆందోళనలు ఉన్నాయని, అటామిక్ ఎనర్జీ బిల్ 2025, హయ్యర్ ఎడ్యుకేషన్ కమీషన్ ప్రతిపాదనలు, చండీగఢ్ రాజ్యాంగ సవరణ బిల్లులపైన ప్రజలు ఆందోళనలతో ఉన్నారన్నారు. ఇండియా కూటమి తరఫున, కాంగ్రెస్ ఎన్నికల సంస్కరణలు కోరుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత బిల్లులను ప్రతిఘటిస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేవలం 15 రోజులు మాత్రమే ఉన్న ఈ సెషన్‌లో, తెలంగాణ ప్రయోజనాలు మరియు ప్రజా సమస్యలను అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి బలంగా వినిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.






