Minister Tummala : జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తాం : మంత్రి తుమ్మల

by Y. Venkata Narasimha Reddy |

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress People's Government)జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా(Rythu Bharosa) ఇవ్వనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao) తెలిపారు.

Minister Tummala : జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తాం : మంత్రి తుమ్మల
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress People's Government)జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా(Rythu Bharosa) ఇవ్వనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao) తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ, సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ బీఆర్ఎస్ విధ్వంస పాలనతో నష్టపోయిన రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేశామన్నారు.

గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు ను తాకట్టు పెట్టి ఎన్నికలకు ముందు రాజకీయం కోసం కొంతమంది రైతులకు రైతు బంధు వేశారన్నారు. పది ఏండ్లగా రేషన్ కార్డులు ఇవ్వలేని సిగ్గులేని గత ప్రభుత్వం గ్రామ సభలను అడ్డుతగులుతుందని మండిపడ్డారు. నల్లగొండలో ఎందుకు రైతు దీక్ష చేస్తారని బీఆర్ఎస్ ను తుమ్మల ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ , రైతుల భరోసా, సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చినందుకా రైతు దీక్ష చేస్తున్నారని నిలదీశారు. చిల్లర మల్లర రాజకీయాలతో పబ్బం గడపవద్దని హితవు పలికారు. నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలో వారి ప్రభుత్వంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయండని తుమ్మల ప్రజలను కోరారు.

రాష్ట్రంలో దొడ్డు బియ్యం మాఫియా పాలవుతోందని..అందుకే ప్రజలు తినే సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకొని వస్తున్నారన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని, వాళ్ళ పదవులు పోయిన బాధను ప్రజల పైన రుద్దుతున్నారని విమర్శించారు. ప్రాణాలకు తెగించి అయిన రైతుల, ప్రజల గౌరవాన్ని కాపాడుతామని ఇచ్చిన హామీలను ఒక్కోటిగా అమలు చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు.

Next Story