CM Revanth Reddy:పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు

by Prasad Jukanti |

తెలంగాణలో పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy:పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ను దేశంలోనే వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందుందని హైదరాబాద్ కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదని ప్రపంచ నగరాలతోనే మా పోటీ అన్నారు. ప్రపంచంతో పోటీపడే నైపుణ్యత మన యువతలో ఉందని నేను నా సహచర మంత్రులు భావిస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్క్ లో ఇవాళ మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కులీ కుతుబ్ షాయీలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే నిజాం నవాబులు హైదరాబాద్- సికింద్రబాద్ జంట నగరాలను నిర్మించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి సైబరాబాద్ అనే మూడో నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీని ప్రపంచానికి అందించబోతోందన్నారు. రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెట్ ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

మహేశ్వరం నియోర్గం పరిధిలో గొప్ప నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం సింగపూర్ తో పాటు ఇతర దేశాల కన్సల్టెన్సీ సంస్థలు నిరంతరం పనిచేస్తున్నాయని సీఎం చెప్పారు. మన దేశంలోనే ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ లెజెండ్ గా ఉంది. ఇప్పుడు గోల్ట్ లో కూడా హైదరాబాద్ లెజండ్ గా అవతరించబోతున్నదన్నారు. ఒక్కోరంగంలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా పెట్టుబడుల విషయాల్లో ప్రభుత్వ పాలసీలు మాత్రం మారలేదని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభదాయకంగా జరిగేలా రాయితీలతో పాటు సహాయ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

Next Story