పోలీసులపై విమర్శలు చేయడం సరికాదు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్న వదిలిపెట్టం: డీజీపీ శివధర్ రెడ్డి

by Malleboina Mahesh |

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2024 తో పోలిస్తే పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని ఆయన వెల్లడించారు.

పోలీసులపై విమర్శలు చేయడం సరికాదు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్న వదిలిపెట్టం: డీజీపీ శివధర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2024 తో పోలిస్తే పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని ఆయన వెల్లడించారు. ఇవాళ తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక-2025 ను (Telangana Police Annual Report 2025) అధికారులతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తగ సంవత్సరంలో 2,34,158 కేసులు నమోదు అయితే 2025 సంవత్సరంలో 2,28,69 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అలాగే నేర నిరూపణ శాతం 3.09 శాతం పెరిగిందని, ఇది గత ఏడాది 35.63 శాతం ఉంటే ఈ ఏడాది 38.72 శాతం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హత్యలు 8.76 శాతం తగ్గాయని. అత్యాచారాలు 13.45 శాతం, దోపీడీలు 27 శాతం, దొంగతనాలు 9.1 శాతం తగ్గాయని డీజీపీ తెలిపారు. నమ్మక ద్రోహం కేసులు 23 శాతం పెరిగాయని వెల్లడించారు.

పోలీసులపై విమర్శలు చేయడం తగదు

అలాగే రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై ప్రతిపక్షలు, వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా వారి పై వస్తున్న విమర్శలపై డీజీపీ స్పందిస్తూ.. తాము పూర్తిగా ఖాకీ బుక్ మాత్రమే ఫాలో అవుతున్నామని, అందుకే రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని, అన్ని లెక్కలు చేపించే తాము మాట్లాడుతున్నామని, పోలీసులపై విమర్శలు చేయడం సరికాదని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదిలిపెట్టమని, ఆధారాలు లభించే కొద్ది విచారణ కొనసాగుతోందని, ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండటం వల్ల తాము ఎక్కువగా మాట్లాడలేమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు చెప్పుకొచ్చారు.

Next Story