- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : ఆ భూములు ప్రైవేట్ పరం చేయము : టీపీసీసీ చీఫ్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kancha Gachibouli Land Issue) తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kancha Gachibouli Land Issue) తెలిసిందే. ఈ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif Mahesh Kumar Goud) స్పందించారు. గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్.. కంచ గచ్చిబౌలి భూములను ప్రైవేటు పరం చేస్తామన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ప్రైవేట్ వ్యక్తి పరం కాబోతున్న భూములను తాము ప్రభుత్వానికి చెందేలా చేశామని తెలిపారు. విపక్షాలు అనవసర రాద్దాంతం మానేయాలని హితవు పలికారు. గత పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూములను విక్రయించారని అన్నారు.
ఎకరం రూ.100 కోట్లు పలికే భూములను కేటీఆర్(KTR) తన అనుచరులకు కేవలం రూ.30 లక్షలకే కట్టబెట్టరాని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దొంగే దొంగా దొంగా అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించడం విచిత్రంగా ఉందన్నారు.






