బీఆర్ఎస్ నేతల్లా మేము ఫొటోలు దిగి హడావిడి చేయం: కవిత కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-05-13 06:55:29  IST  )

నీటి ప్రాజెక్టులపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ నేతల్లా మేము ఫొటోలు దిగి హడావిడి చేయం: కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీటి ప్రాజెక్టుల అంశాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి, కృష్ణా నదులపై ఒక్కో ప్రాజెక్టులకు మూడు విధానాలు అమలు చేస్తున్నారని అందులో ఒకటి విఫలమైతే మరొకటి ఆచరణలోకి తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. ఏపీ చేస్తున్న ప్రత్యామ్నాయాలు సరే మనం ఎందుకు ఆ రకంగా చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టుల కోసం లక్ష 80 వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వేలాది కోట్లు నిధులు ఖర్చు చేస్తామంటున్నారు. కానీ ఇప్పటి వరకు గోదావరి, కృష్ణా నీళ్లలో పూర్తి వాటా వాడుకోలేకపోతున్నామన్నారు.

బీఆర్ఎస్‍లో మాదిరిగా చేయం:

మేము అధికారంలోకి వచ్చాక వాటర్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ రెండు నది జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు. జూరాల నుంచి ఏపీకి నీళ్లు వెళ్లే వరకు చిన్న ఆనకట్టు కూడా లేదన్నారు. మేము అధికారంలోకి వచ్చాక వందేళ్లు మన్నిక కలిగి ఉండేలా గేట్లతో కూడిన చెక్ డ్యామ్ లు నిర్మిస్తామన్నారు. గతంలో బీఆర్ఎస్ మాదిరిగా కొట్టుకుపోయేలా చెక్ డ్యామ్ నిర్మించి రెండు ఫోటోలు తీసుకునేలా కాకుండా శాశ్వతంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. నీటి విషయంలో మా అంతవారే లేరు అని చెప్పుకునే బీఆర్ఎస్ నుంచి ప్రధాన మంత్రి వస్తే ఒక్క ప్రశ్నకూడా ఎందుకు అడగలేదని నిలదీశారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోస అన్నారు. బనకచర్ల విషయంలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‍ను కలుస్తామన్నారు.

దేశమంతా పర్యటిస్తాం:

రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తామని కవిత చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి పంపించిన బీసీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.

Next Story