- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరి, కృష్ణా జలాలపై రాజీ పడబోం.. చంద్రబాబుకు సీఎం రేవంత్ కౌంటర్
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడకలకు హాజరైన సీఎం చంద్రబాబు (CM Chandrababu) బనకచర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో ఎవరికీ నష్టం వాటిల్లదని.. ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పని లేదని కామెంట్ చేశారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో తాము నష్టాలను భరిస్తున్నామని కామెంట్ చేశారు. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట వేదికగా రెండు రాష్ట్రాల నీటి వాటాలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తాము గోదావరి, కృష్ణా జలాలపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. తెలంగాణ అవసరాలు అన్నీ తీరాకే.. ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తామని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను దక్కించుకుని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలను భరిస్తున్నాం.. సీఎం చంద్రబాబు
తాము నిర్మించ తలపెట్టిన బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం ఉండబోదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సముద్రంలోని వృథాగా పోయే నీటిని మాత్రమే వినయోగిస్తున్నామని అన్నారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో తాను నష్టాలను భరిస్తున్నామని కామెంట్ చేశారు. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ.. ఆ నీటిని వాడుకొవొద్దా అని చంద్రబాబు అన్నారు.






