- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తాం.. ‘స్థానిక’ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ రోజుల్లో రిగ్గింగ్ చేయడానికి సాధ్యపడదని.. అలా చేయడానికి పాత జమానా కాదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో రిగ్గింగ్ చేయడానికి సాధ్యపడదని.. అలా చేయడానికి పాత జమానా కాదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో మీడియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం ఇచ్చారు. తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పదేళ్లు కాంగ్రెస్ సర్కారుకు ఎలాంటి ఢోకా లేదన్నారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందని తెలిపారు. ప్రచారంలో మంత్రులతో పాటు ఇంచార్జ్ బాధ్యతలు తీసుకున్న ప్రతీ ఒక్కరూ బాగా పని చేశారని కీతాబిచ్చారు. అయితే, పోలింగ్ పర్సంటెజ్ పెరిగి ఉండాల్సిందని.. పట్టణ ప్రజలు, యువత ముందుకు వచ్చి ఓటు వేయాల్సి ఉండే అంటూ కామెంట్ చేశారు. ఈ రోజుల్లో రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదని.. ఇదేమి పాత జమానా కాదని కొట్టిపడేశారు. ఓడిపోతున్నామనే బాధతో బీఆర్ఎస్ (BRS) వాళ్లు మాట్లాడుతున్నారని అన్నారు.
కేబినెట్ విస్తరణ, మార్పులు అధిష్టానం చూసుకుంటది..
దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అదే నేడు జూబ్లీహిల్స్‌లో తమ పార్టీ అభ్యర్థికి ప్లస్ పాయింట్‌గా మారిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో పాజిటివ్ వేవ్ కనిపిస్తుందని.. మళ్లీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలోనే జరగబోతున్నాయని.. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తామని అన్నారు. మరోసారి ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి.. ఆ విషయంపై స్పష్టత ఇస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని అనుకున్నామని.. కానీ కేంద్రంలోని బీజేపీ (BJP) అడుగడుగునా అడ్డు పడుతోందన్నారు. ఇక కేబినెట్ విస్తరణ, మార్పుల విషయం అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మరోవైపు డీసీసీ అధ్యక్షుల ప్రకటన ఏ క్షణమైన రావొచ్చన్నారు. ఇక సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ ఫేక్ సర్వేలతో టెంపరరీ గేమ్ ఆడుతోందని అన్నారు. తనకు పదవి కావాలని ఏ రోజూ అడిగింది లేదని స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్ గెలుస్తుందనే నమ్మకం ఉందని.. త్వరలోనే ‘ఓట్‌చోరీ’పై కమిటీ వేయనున్నట్లుగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.






