- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికం చేస్తాం : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
తెలంగాణ బీజేపీ కార్యాలయంలో (Telangana BJP Office) బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు (Telagana Liberation Day) జరిగాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ కార్యాలయంలో (Telangana BJP Office) బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు (Telagana Liberation Day) జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ram Chandar Rao) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే అధికారికంగా చేయడం కాదన్న ఆయన.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
1948 సెప్టెంబర్ 16 వరకూ నిజాంల పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం.. సెప్టెంబర్ 17న భారత సమాఖ్యలో విలీనమైంది. నాటి నుంచి ప్రతి ఏడాది ఈరోజును రాష్ట్ర విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినా.. హైదరాబాద్ సంస్థానంలో మాత్రం నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పాలన మరో 13 నెలలు కొనసాగింది. వారి పాలనలో హైదరాబాద్ సంస్థానం బానిసత్వంలో మగ్గిపోయింది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేతృత్వంలో అప్పటి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో ప్రకటించింది. 1948 సెప్టెంబర్ 13న ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ లోకి ప్రవేశించగా.. నాలుగురోజుల్లో నిజాం వారికి లొంగిపోయాడు. 17న అతని లొంగుబాటుపై అధికారిక ప్రకటన రావడంతో హైదరాబాద్ భారత్ లో విలీనమైంది. ఈ పోరాటంలో ఎంతోమంది తెలంగాణ ప్రజలు ప్రాణ త్యాగం చేయగా.. రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం, చంద్రరాజేశ్వరరావు, షోయాబుల్లాఖాన్ వంటి నాయకులు కీలక పాత్ర పోషించారు.






