క్రీడలకు 'హైదరాబాద్' ను వేదికగా మారుస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి

by Geesa Chandu |

ప్రపంచ ప్రసిద్ధి పొందిన క్రీడా పోటీలకు హైదరాబాదును వేదికగా మార్చేందుకు, అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

క్రీడలకు హైదరాబాద్ ను వేదికగా మారుస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ ప్రసిద్ధి పొందిన క్రీడా పోటీలకు హైదరాబాదును వేదికగా మార్చేందుకు, అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. క్రీడలకు అవసరమైన నిధులను కేటాయిస్తామని వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవంను పురస్కరించుకొని స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీ స్టేడియంలో ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఒలంపిక్స్ తో పాటు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే విధంగా క్రీడా శాఖను తీర్చిదిద్దుతామని, అందులో భాగంగానే స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకోల్పేందుకు శ్రీకారం చుట్టామన్నారు. అన్ని విద్యాసంస్థల్లో స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తుందన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే.శివసేన రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ఎన్నో క్రీడాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో స్పోర్ట్స్ అథారిటీ ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ వీసీఎండి కే.సోని బాలాదేవి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు.

Next Story