భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ చేస్తాం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-21 16:52:01  IST  )

భాగ్యలక్ష్మి ఆలయాన్ని (Bhagya Lakshmi) గోల్డెన్ టెంపుల్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు.

భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ చేస్తాం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భాగ్యలక్ష్మి ఆలయాన్ని (Bhagya Lakshmi) గోల్డెన్ టెంపుల్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లో బీజేపీ అభ్యర్థి లంకల దిలీప్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలోని నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. అటు నుంచి నేరుగా చార్మినార్ పరిధిలోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ పార్టీ అగ్ర నాయకులైన అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అమ్మవారి కృపకు పాత్రులయ్యారని పేర్కొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం రావడం తన అదృష్టమని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఇదే భాగ్యలక్ష్మి టెంపుల్‌ను గోల్డెన్ టెంపుల్‌గా తీర్చిదిద్దుతామని బండి సంజయ్ అన్నారు.

Next Story