- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడియం కాంగ్రెస్‌లో చేరానని ప్రకటిస్తే వదిలేస్తాం.. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య
స్టేషన్ ఘన్‌పూర్ (Station Ghanpur)లో రాజకీయం రంజుగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్ (Station Ghanpur)లో రాజకీయం రంజుగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం కడియంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజయ్య ఇవాళ రఘనాథపల్లి (Raghunathapally) మండల పరిధిలో పాదయాత్రకు సిద్ధమయ్యారు. దీంతో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు సూచించినా.. వినకపోవడంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు ఆయను విడిచిపెట్టారు.
ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి దమ్ముంటే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయాలన్నారు. బీఆర్ఎస్ (BRS) జెండాపై గెలిచి మరో పార్టీలో కొనసాగడం సిగ్గుచేటని కామెంట్ చేశారు. ఆయన ఎమ్మెల్యే పదవి రిజైన్ చేసేందుకు వరకు ఆందోళన ఆగదని అన్నారు. కడియం తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని ప్రకటిస్తేనే.. వదిలేస్తామని స్పష్టం చేశారు. తాను నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే కడియం శ్రీహరికి అంత భయమెందుకని రాజయ్య ప్రశ్నించారు.






