ఇండియన్ సినిమాకు హైదరాబాద్ ను కేంద్రంగా నిలుపుతాం : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని నిలుపుతామని సీఎం. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇండియన్ సినిమాకు హైదరాబాద్ ను కేంద్రంగా నిలుపుతాం : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని నిలుపుతామని సీఎం. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతను అందిస్తామ‌ని తెలిపారు. 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

హైదరాబాద్‌లో సినిమా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలియజేశారు. అవార్డు గ్రహీతలైన భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హనుమాన్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి వెంకట్, శ్రీనివాస్, టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబి సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్, సింగర్ రోహిత్ ను ముఖ్యమంత్రి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్, భగవంత్ కేసరి నిర్మాత గారపాటి సాహుతో పాటు ఇతరులు పాల్గొన్నారు.

Next Story