- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ మీద కేసులు పెడతాం.. ఎమ్మెల్యే నాయిని హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వరంగల్ (Warangal)లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) నేతలంతా పక్కా దొంగలని కామెంట్ చేశారు. అధికారంలో ఉండి వారు చేసిన పాపాలకు మరో పది జన్మల పాటు జైల్లో పెట్టినా.. ఆ శిక్ష సరిపోదని ధ్వజమెత్తారు. వరంగల్‌లో జరిగిన అవినీతి, పెద్ద ఎత్తున నిధుల దుర్వియోగంపై కేటీఆర్ మీద కేసులు పెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి చీడ పరుగులు బయట తిరగనివ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి తాను విజ్ఞప్తి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
మీడియా ప్రతినిధుల సమక్షంలోనే కేటీఆర్‌ను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (Warangal Municipal Corporation) పిలిపించాలని.. నగరానికి బీఆర్ఎస్ చేసిందేంటో, కాంగ్రెస్ (Congress) చేసిందేంటో తేల్చుదామని అన్నారు. ఒకవేళ తమ పార్టీది తప్పుంటే తాను రాజీనామా చేస్తానని.. బీఆర్ఎస్‌ది తప్పుంటే కేటీఆర్ రాజీనామా చేయాలన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, రేవంత్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని.. కనీసం కూతురి పెళ్లికి కూడా రానివ్వకుండా చేశారని గుర్తు చేశారు. పదేళ్ల అక్రమ సంపాదన, బలుపుతో సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకుని కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని అన్నారు. మళ్లీ ప్రభుత్వమే వారిపై కక్షసాధింపు చర్యకు పాల్పడుతోందంటూ కామెంట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమను బీఆర్ఎస్ నేతలు ఉరికించి కొడుతామంటు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని.. అదే తాము తలుచుకుంటే వాళ్లంతా రాష్ట్రం వదిలి పరార్ అయ్యే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.






