- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP Chamala : బండి సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం : ఎంపీ చామల
ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) ప్రచారంలో ఇండియా గెలవాలంటే బీజేపీ(BJP)కి ఓటెయ్యాలి.. పాకిస్థాన్ గెలవాలంటే కాంగ్రెస్(Congrss)ఓటెయ్యాలి అని బండి సంజయ్( Minister Bandi Sanjay) మాట్లాడటం హాస్యాస్పదమని..గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం ఇలా మాట్లాడడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy)విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) ప్రచారంలో ఇండియా గెలవాలంటే బీజేపీ(BJP)కి ఓటెయ్యాలి.. పాకిస్థాన్ గెలవాలంటే కాంగ్రెస్(Congrss)ఓటెయ్యాలి అని బండి సంజయ్( Minister Bandi Sanjay) మాట్లాడటం హాస్యాస్పదమని..గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం ఇలా మాట్లాడడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy)విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పోగానే కార్పోరేటర్ గా మారిపోయి మాట్లాడుతుంటాడని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి ,నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడకుండా బండి సంజయ్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లో ప్రవర్తన నియమావళికి విరుద్దంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని చామల తెలిపారు.
అంతకుముందు కరీంగనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ మాది ఇండియా టీం....కాంగ్రెస్ ది పాకిస్తాన్ టీం అని... ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ టీం అని విమర్శలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా గెలిచిందని..ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో తెలంగాణలో ఇండియా టీం, పాకిస్తాన్ టీం మధ్య మ్యాచ్ జరగబోతోందని...ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటేయండని..పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటేయండంటూ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్ లోనూ కాంగ్రెస్ టీంను చిత్తుగా ఓడిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల క్రికెట్ మ్యాచ్ లో బీఆర్ఎస్ జట్టే లేదని... ఆ టీంకు సభ్యులే లేక మ్యాచ్ నుండి వైదొలగిందన్నారు. 14 నెలల కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుందామా? అంటూ కాంగ్రెస్ ను సవాల్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారని..మీరు వాళ్లను అరెస్ట్ చేయకుండా పారిపోయేలా చేసిందే మీరు...మీరు విదేశాలకు పంపిస్తే...మేం పట్టుకురావాలా? అని ప్రశ్నించారు.






