ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కొట్టివేత.. స్పీకర్ తీర్పుపై న్యాయపోరాటం చేస్తాం: బీఆర్ఎస్

by Prasad Jukanti |

స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కొట్టివేత.. స్పీకర్ తీర్పుపై న్యాయపోరాటం చేస్తాం: బీఆర్ఎస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో (MLA Disqualification Issue) తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) వెలువరించిన తీర్పుపై న్యాయపోరాటం చేస్తామని బీఆర్ఎస్ (BRS Reaction) ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, కల్వకుంట్ల సంజయ్ అన్నారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చిన తీర్పుగా భావిస్తున్నామని చెప్పారు. సీఎం వ్యాఖ్యలను సమర్ధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోందని, స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని వీరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఇవాళ స్పీకర్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ నిర్ణయంపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహాటంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు కఠినంగా హెచ్చరించేంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామన్నారు. మా వాదనలు పట్టించుకోకుండా ఏకపక్ష తీర్పు ఇచ్చారని, తీర్పు కాపీని అధ్యయనం చేసి కోర్టుకు వెళ్తామని చెప్పారు. స్పీకర్ తన విధులు నిర్వహించడంలో విఫలం అయ్యారని, తీర్పు కాపీ ఇవ్వమని అడిగినా స్పీకర్ నుంచి సమాధానం లేదన్నారు.

Next Story