విద్యుత్ కాంట్రాక్టర్ల ఇబ్బందులు తొలగిస్తాం

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని విద్యుత్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చూస్తామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ హామీ ఇచ్చారు.

విద్యుత్ కాంట్రాక్టర్ల ఇబ్బందులు తొలగిస్తాం
X
  • స్టేట్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌కు సీఎండీ హామీ

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని విద్యుత్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చూస్తామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ హామీ ఇచ్చారు. స్టోర్స్ లో మెటీరియల్ లేక కాంట్రాక్టర్లు పనులు చేసే పరిస్థితి లేదని, నూతన విధానాలు, కొత్త పాలసీలతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్లు సీఎండీ దృష్టికి తీసుకుపోయారు. బుధవారం తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం డైరీని సీఎండీ ఆవిష్కరించారు. కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని.. నూతన విధానాలపై వారికి అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. వర్క్ ఆర్డర్లు తొందరలో ముగించి ఎల్ఓసిలు త్వరగా ఇవ్వాలని సీఎండీని కోరగా.. సానుకూలంగా స్పందించారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ విద్యుత్తు ప్రధాన తనిఖీ అధికారి కే నందకుమార్, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ వై. లింగారెడ్డి.. అసోసియేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు, రాష్ట్ర ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు సభ్యులు నక్క యాదగిరి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే మాజీద్, రాష్ట్ర ఉపాధ్యక్షులుపి సదానంద గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.పర్వతాలు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి ఇసాక్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story