- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీపీపీ విధానంలో పర్యాటకాన్నిఅభివృద్ది చేస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రజాపాలనలో పీపీపీ విధానంలో అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో పర్యాటకాభివృద్ధికి ఎలాంటి విధానం లేదని, ప్రజాపాలనలో ప్రత్యేక పాలసీని రూపొందించుకున్నామని, పబ్లిక్-ప్రయివేటు పార్ట్ నర్ షిప్(పీపీపీ) విధానంలో అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సభ్యులు లక్ష్మీకాంతారావు, ఆది శ్రీనివాస్, పాయల్ శంకర్ అడిగిన ప్రశ్నలకు సమధానంగా మంత్రి మాట్లాడారు. టైగర్ జోన్ లో కూడా టూరిజాన్ని డెవలప్ చేయడానికి అధ్యయనం చేయాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. టెంపుల్ టూరిజంపై కూడా ప్రత్యేెక ఫోకస్ పెట్టామని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కౌలాస్ కోట, కౌలాన్ నాలా, నిజాంసాగర్ ప్రాజెక్టు టూరిజం డెవలప్ చేస్తామని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన కాటేజీలు, రెస్టారెంట్, స్పా, ఆర్చ్లు, ల్యాండ్ స్పేపింగ్, హార్డ్ స్కేపింగ్ వంటి పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి వివరించారు.






