- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Seethakka : పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం : మంత్రి సీతక్క
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) స్పష్టం చేశారు. ములుగు జిల్లాల వరంగల్ పసర - ఏటూరు నాగారం మధ్య నేషనల్ హైవే 163 పక్కన ఏకో టూరిజంలో భాగంగా ఏర్పాటు చేసిన బ్లాక్ బెర్రీ(Black Berry) ఐలాండ్ ట్రయల్ రన్(Trial run) ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. త్వరలోనే మొండ్యల తొగు బ్లాక్ బెర్రీ ప్రారంభించబోతున్నామని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేల బ్లాక్ బెర్రీ దీవి ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా స్వయంగా మంత్రి సీతక్క బ్లాక్ బెర్రీని ప్రమోట్ చేస్తూ వీడియోలో మాట్లాడం ఆకట్టుకుంది. వీడియోలో సీతక్క మాట్లాడుతూ ఇవి అమేజాన్ అడవులు, లేక అమెరికా అడవులు అంతకన్న కావని, మా ములుగు అడవులని.. ప్రజలంతా ఇక్కడికి రండి.. స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు, ఆనందం, ఉల్లాసం ఆరోగ్యం పొందడానికి ఈ బ్లాక్ బెర్రీని సందర్శించండంటూ కోరారు. అందరికి స్వాగతమని తెలిపారు.






