ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం : నారా లోకేశ్

by samatah |

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. అయితే కర్నూలు జిల్లా కోర్టు భవనం ముందుకు లోకేశ్ పాదయాత్ర చేరుకుంది.

ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం : నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. అయితే కర్నూలు జిల్లా కోర్టు భవనం ముందుకు లోకేశ్ పాదయాత్ర చేరుకుంది. అయితే లోకేశ్ పాదయాత్రలో న్యాయవాదులు హల్‌చల్ చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో న్యాయవాదులతో చంద్రబాబు మాట్లాడారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తానని చెప్పిన సీఎం జగన్ ఆ తర్వాత మాట మార్చారని చెప్పుకొచ్చారు.

అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసిందని లోకేశ్ గుర్తు చేశారు. అంతేకాదు బెంగళూరు పర్యటనలో విశాఖపట్నంలో హైకోర్టు ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తాడేపల్లిలోని జగన్ ఇంటి ఎదుట ధర్నాకు దిగాలని సూచించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు లోకేశ్ దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. కర్నూలుకు కేటాయించిన జ్యూడిషియల్ అకాడమీని జగన్ తరలించారని చెప్పుకొచ్చారు. హై కోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారు అని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మాయ మాటలు విని మోసపోయామని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వెంటనే కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. జగన్‌లా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ తమది కాదని చెప్పుకొచ్చారు. బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం అని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.

Next Story