ఎంత ఖర్చయినా గద్దెల పున:నిర్మాణ పనులు పూర్తి చేస్తాం

by Elthuri vijay kumar |

మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని నూతన పరిజ్ఞానంతో ఎంత ఖర్చయినా వెనకాడకుండా వంద రోజుల్లో పూర్తి చేయనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఎంత ఖర్చయినా గద్దెల పున:నిర్మాణ పనులు పూర్తి చేస్తాం
X

ఎంత ఖర్చయినా గద్దెల పున:నిర్మాణ పనులు పూర్తి చేస్తాం

మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల డిజైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి

వంద రోజుల్లో నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటణ

వెయ్యేండ్లు నిలిచిపోయేలా కట్టడాలు ఉండాలని సీఎం ఆదేశాలు

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని నూతన పరిజ్ఞానంతో ఎంత ఖర్చయినా వెనకాడకుండా వంద రోజుల్లో పూర్తి చేయనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాదాపు రెండు గంటల పాటు అధికారులు గిరిజనులు ఆర్కే లాజ్ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి నూతన కట్టడాన్ని ఖరారు చేశారు. మేడారం గద్దెల ప్రాంగణాన్ని చేరుకున్న ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటన చేశారు. సంబంధిత అధికారులు సిమెంట్ తో నిర్మాణం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసి సమర్పించినప్పటికీ వెయ్యి కాలాలపాటు నిలిచిపోయే విధంగా రాతితో కట్టడాలు చేయాలని తాను సూచించానని వివరించారు. గతంలో రామప్పను రుద్ర దేవుడు రాతితో కట్టడాలు చేయడం వల్లే అది నేటికి చిరస్థాయిగా నిలిచిపోయి యునెస్కో గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. తాము రాయితో కట్టే సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు చిరస్థాయిగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నామని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Next Story