కేబినెట్‌కు పట్టిన మకిలిని కడిగేస్తాం.. మీడియాతో మంత్రి అడ్లూరి చిట్‌చాట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-21 12:46:57  IST  )

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు దండుపాళ్యం బ్యాచ్ అనడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరోసారి ఫైర్ అయ్యారు.

కేబినెట్‌కు పట్టిన మకిలిని కడిగేస్తాం.. మీడియాతో మంత్రి అడ్లూరి చిట్‌చాట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు దండుపాళ్యం బ్యాచ్ అనడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇవాళ సచివాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా అనుభవం ఉన్న హరీష్‌రావు తమ కేబినెట్‌ను అవమానించారని ఆరోపించారు. ఆయన లాగా పైకి నవ్వి.. లోపల కార్పొరేటు రాజకీయాలు చేయడం తమకు తెలియవని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చీలికకు హరీష్‌రావు కారణం కాదా.. అని అడ్లూరి ప్రశ్నించారు.

హరీశ్‌రావు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు చేయడం మాకు తెలీదా.. అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కామెంట్ చేశారు. ఆయన లెక్క యాస, భాష తమకు తెలీదని.. తమకు తెలిసింది ప్రజలకు సేవ చేయడమేనని అన్నారు. ఐదేళ్లు తమకు ప్రజలు అధికారం ఇచ్చారని.. కానీ 22 నెలలకే ఎందుకు అంత ఆక్రోశమని ప్రశ్నించారు. హరీష్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన లెక్కలు అన్ని తమ దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. రేపు శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిండు స్నానం చేస్తానని.. హరీశ్‌రావు వ్యాఖ్యల నేపథ్యంలో కేబినెట్‌‌కు పట్టిన మకిలిని కడిగేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

Next Story