ఈనెల 25వ తేదీన ఘనంగా ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తాం : సీఈవో సుదర్శన్​రెడ్డి

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ఈనెల 25న జరిగే ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు తాము నిర్వహించే ఓటరు చైతన్యం కార్యక్రమానికి సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్​రెడ్డి కోరారు.

ఈనెల 25వ తేదీన ఘనంగా ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తాం : సీఈవో సుదర్శన్​రెడ్డి
X

దిశ, హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 25న జరిగే ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు తాము నిర్వహించే ఓటరు చైతన్యం కార్యక్రమానికి సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్​రెడ్డి కోరారు. ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మ ముఖ్య అతిథిగా హాజరైతారని ప్రకటించారు. సోమవారం బీఆర్కే భవన్​లోని తన కార్యాలయంలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 తుది ప్రచురణ ఈనెల 6 న జరిగిందని, ఓటరు నమోదు ప్రస్తుత పరిస్థితి, రాష్ట్ర ఓటర్ల జాబితాలలో మార్పులు, చేర్పులు నిర్ధారించడానికి చేపట్టిన కార్యక్రమాలు, ప్రక్రియను పారదర్శకంగా ఉండేలా పార్టీలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈసమావేశానికి బిజెపి, మజ్లిస్, ఆమ్ ఆద్మీ పార్టీ , కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం) నాయకులు పాల్గొన్నారు.

Next Story