- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM KCRకి డబుల్ బెడ్ రూమ్ అక్కడ కట్టిస్తాం.. : రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ వాళ్లు గుంపులు గుంపులుగా వస్తున్నారని కేసీఆర్ అంటున్నారు. తాను బక్కొడిని అని సీఎం అంటున్నారని కేసీఆర్ బక్కోడు కాదని బకాసురుడన్నారు. ఫామ్ హౌస్‌లో పడుకునే కుంభకర్ణుడివి అంటూ విరుచుకుపడ్డారు. మంత్రి హరీష్ రావు దుబ్బాక నిధులను సిద్ధిపేటకు తరలిస్తున్నారన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్రం నుంచి నిధులు తెస్తా అది చేస్తా ఇది చేస్తా అని హామీలు ఇచ్చి ఏమీ చేయలేదన్నారు. దుబ్బాకను బంగారు తునక చేస్తానన్న కేసీఆర్, హరీష్ రావు బొందల గడ్డ చేశారన్నారు. సీఎం కేసీఆర్‌కి డబుల్ బెడ్ రూమ్ చర్లపల్లి జైలులో కట్టిస్తామన్నారు.
Next Story






