MLC Kavitha : పంచాయితీ ఎన్నికలను అడ్డుకుంటాం : ఎమ్మెల్సీ కవిత

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

MLC Kavitha : పంచాయితీ ఎన్నికలను అడ్డుకుంటాం : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేడు కవిత జాతీయ మీడియా మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్(BC Reservations) అంశం తేలకుండా స్థానిక ఎన్నికలు(Local Body Elections) నిర్వహించాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాకే పంచాయితీ ఎన్నికలకు వెళ్లాలని, లేని పక్షంలో ఎన్నికలను అడ్డుకుంటామని కాంగ్రెస్ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. ప్రతీ వార్డులో తాము వందల నామినేషన్లు వేస్తామని, బీసీ రిజర్వేషన్లకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకొని వస్తేనే నామినేషన్ వేయనిస్తామని తెలిపారు.

బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో మండలిలో ఆమోదించి కేంద్రానికి పంపించామని, పార్లమెంటులో కేంద్రం దీనిని ఆమోదించకపోతే దేశవ్యాప్త నిరసనలకు దిగుతామని అన్నారు. జులై రెండవ వారం వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నామని, ఆలోపు అనుమతి ఇవ్వకపోతే జులై 17 నుంచి రైలురోకో(Rail Roko)లు చేపడతామని హెచ్చరించారు. ఇక ఏపీ నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్, బొల్లాపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

ఆపరేషన్ కగార్(Operation Kagar) పై కవిత స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ ఆపివేసి మావోయిస్తులతో శాంతి చర్చలు జరపాలని అన్నారు. ఎన్కౌంటర్లు అమానవీయ చర్యలు అని, ఈ ఆపరేషన్‌ను తమ పార్టీతో సహ తెలంగాణ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు.

Next Story