- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం ఇంటిని ముట్టడిస్తాం.. బీజేపీ మహిళా మోర్చ హెచ్చరిక
by Prasad Jukanti |
ప్రభుత్వాన్ని శిల్పారెడ్డి హెచ్చరించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ మహిళలకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే సీఎంతో పాటు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. ఆడబిడ్డలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతున్నా చర్యలు తీసుకోలేని చేతకాని మంత్రులు రాష్ట్రంలో ఉన్నారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బెల్టు షాపులు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మహిళా నేత బండ కార్తిక రెడ్డి మాట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం అయిందని విమర్శించారు.
Next Story






