- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచారణకు హాజరవుతాం.. భయపడేది లేదు: మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట విచారణకు హాజరవుతామని.. ఎవరికీ భయపడేది లేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట విచారణకు హాజరవుతామని.. ఎవరికీ భయపడేది లేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని తెలంగాణ భవన్‌లో ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. బీజేపీకి జేబు సంస్థలా NDSA మారిందని కామెంట్ చేశారు. ఈడీ (ED), సీబీఐలా ఎన్‌డీఎస్ఏ (NDSA) వ్యవహరిస్తుందని ఆరోపించారు. మేడిగడ్డ పిల్లర్ కుంగితే మూడు రోజుల్లోనే ఎన్‌డీఎస్ఏ రిపోర్టు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. తాము కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లేందుకు భయపడుతున్నామని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. అసలు ఎవడు చెప్పిండు నీకు భయపడుతున్నామని ఫైర్ అయ్యారు. తాము ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతామని.. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడేది లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేస్తున్న దుష్ప్రచారాలను తప్పకుండా పటాపంచలు చేస్తామని హరీష్ రావు తెలిపారు.






