సదా మీ సేవలను స్మరిస్తూనే ఉంటాం.. రాజీవ్ జయంతి వేళ సీఎం రేవంత్ ట్వీట్

by Kema Shiva Kumar |

భారతదేశ ఐటీ, టెలికాం రంగాల పితామహుడు, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ప్రజలకు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

సదా మీ సేవలను స్మరిస్తూనే ఉంటాం.. రాజీవ్ జయంతి వేళ సీఎం రేవంత్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ ఐటీ, టెలికాం రంగాల పితామహుడు, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ప్రజలకు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేక్‌లు కట్ చేస్తూ, రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీవ్ జయంతి వేళ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా నివాళులర్పి్స్తూ ట్వీట్ చేశారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పిస్తున్నా. రాజీవ్ గాంధీ గారి సేవలను స్మరిస్తూ జరుపుకునే ‘సద్భావనా దివస్’ సందర్భంగా దేశ వ్యాప్తంగా శాంతి, సామరస్యం, సమానత్వం, ఐక్యత సందేశాన్ని చాటుదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Next Story