- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు కేటాయిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంతో తెలంగాణ రాష్ట్రం హరితవనం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇ

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంతో తెలంగాణ రాష్ట్రం హరితవనం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని బొటానికల్ గార్డెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం-2025ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ రుద్రాక్ష మొక్కను నాటి అనంతరం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతోన్న వన మహోత్సవంతో తెలంగాణ హరిత వనం కావాలని ఆక్షాంక్షించారు. మనం చెట్టును కాపాడితే.. చెట్టు మనల్ని కాపాతుందని అన్నారు. ఈ ఏడాది 18.03 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
ఆడబిడ్డలను అగ్రభాగాన నిలపాలన్నదే మా ఆకాంక్ష
తల్లులు మొక్కలు నాటితే పిల్లలను చూసుకున్నట్లే చూసుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో రెండు చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళలను కోటీశ్వరులగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మహిళల చేత ఇందిరా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయించామని అన్నారు. మహిళ సంఘాల చేత బస్సులు కోనుగోలు చేయించి..ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని వివరించారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది మహిళలను చేర్చాలేని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఒకప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్టులు అంబానీ, అదానీ వంటి వారే ఏర్పాటు చేసేవారని.. త్వరలోనే మహిళలు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూసిందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో మంత్రి వర్గంలో ఒక్క మహిళలకుకూడా చోటు దక్కలేదని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడటానికి, వ్యాపారాలు పెట్టుకునేందుకు ఈ సంవత్సరం రూ.21 వేల కోట్లు మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ఇచ్చామని గుర్తు చేశారు. ఆడబిడ్డలను అగ్రభాగన నిలపాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు.
ఆ ఘనత ఒక్క ఇందిరమ్మకే దక్కింది..
ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, అసైన్డ్ భూములు, పోడు భూములు పట్టాలు ఇచ్చిన ఘనత ఒక్క ఇందిరా గాంధీకే దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తేవడం వల్లే నేడు గద్వాల విజయలక్ష్మి, శ్రీలతలు మేయర్, డిప్యూటీ మేయర్ అయ్యారని అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతున్నాయని 153కు పెరగబోయే సీట్లలో 33 శాతం అంటే 51 సీట్లుకు అదనంగా మరో తొమ్మిది సీట్లు కలిపి మొత్తం 60 ఎమెల్యే సీట్లు మహిళలకు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






