Jeevan Reddy : పసుపుబోర్డు ఏర్పాటు స్వాగతిస్తున్నాం : జీవన్‌రెడ్డి

by Muthe.Rajitha |   (  Updated:2025-01-15 15:40:47  IST  )

కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్(Nizamabad) లో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(Congress MLC Jeevan Reddy) స్పందించారు.

Jeevan Reddy : పసుపుబోర్డు ఏర్పాటు స్వాగతిస్తున్నాం : జీవన్‌రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్(Nizamabad) లో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(Congress MLC Jeevan Reddy) స్పందించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా పసుపుకు మద్దతు ధర కల్పించడమే కాకుండా.. మార్కెటింగ్‌ వ్యవస్థ, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పసుపు బోర్డుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తూ.. బోర్డుకు ప్రత్యేక నిధి కేటాయించాలని తెలియజేశారు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకొని నిజామాబాద్ లోని నిజాం చక్కెర కర్మాగారం(Suger Factory) పునఃప్రారంభించాలన్నారు. ఉమ్మడి నిజామాబాద్ ప్రాంతం లో పసుపు పంట సాగు ఎక్కవగా ఉండడంతో పాటు పంటకూడా బాగా పండుతుందన్నారు. పసుపు రైతుల రెండు దశాబ్దాల పోరాటం ఫలితంగా ఈ బోర్డు ఏర్పాటు కావడం, నిజామాబాద్ కేంద్రంగా 2022 లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం మరచిపోమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి తమ ప్రభుత్వం లేఖ రాసిందని తెలిపారు.

సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్​ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ పసుపు బోర్డు కు ప్రత్యేక కార్యలయం ఏర్పాటు చేయాలని, అలాగే ప్రత్యేక నిధిని కేటాయించాలని సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్​ అన్వేష్ రెడ్డి కోరారు. పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా వాసినే (పల్లె గంగారెడ్డి ) నియమించడం శుభ పరిణామం అని, అయితే మొన్న నిర్వహించిన జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమం బీజేపీ కార్యక్రమంగా చేశారని, కనీసం రాష్ట్రం ప్రభుత్వాన్ని ఆహ్వానించనే లేదని అన్వేష్​రెడ్డి ఆరోపించారు. ఎట్టకేలకు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వలన నిజామాబాద్​జిల్లాలో పసుపు పంట సాగు మరింత పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, పసుపు బోర్డు కోసం కాంగ్రెస్​పార్టీగా తాము కూడా పోరాటం చేశామని, రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా భవిష్యత్తులో పసుపు బోర్డు కోసం కావాల్సిన పనులు చేస్తుందని భరోసా ఇస్తున్నామన్నారు.

Next Story