- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం.. మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో కొత్త భూ చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త భూ చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్‌లో భూ భారతి పోర్టల్ పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి దేశానకే రోల్ మోడల్ అని అన్నారు. ప్రతి ఒక్కిరికీ మంచి జరగాలనే భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చామని కామెంట్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ప్రతిపక్షాలు ఓర్వడం లేదని ఫైర్ అయ్యారు. ‘ధరణి’ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ లక్షలాది ఎకరాలను దొచేసిందని ఆరోపించారు. ధరణిలో తప్పులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలే తన వద్దకు వచ్చారని తెలిపారు.
అదేవిధంగా అసెంబ్లీలో తనను ప్రత్యేకంగా కలిసి తప్పులు సరిదిద్దాలని కోరారని గుర్తు చేశారు. అందులో గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్నదాత భూ సమస్యలను ఒక్క పైసా చెల్లించే అక్కర్లేకుండా తీరుస్తామని అన్నారు. అధికారులే ప్రజల దగ్గరకు వెళ్లి భూసమస్యలు పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. రైతుల భూ సమస్యలను తెలుసుకునేందుకు అన్ని రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. అందుకే నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశామని తెలిపారు. మే 1 నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 28 జిల్లాలో పైలట్ మండలాలుగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామి అన్నారు. జూన్ 2న నాలుగు పైలెట్ మండలాల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్య తీసుకుంటామని పేర్కొరన్నారు. మోడల్ మండలాల మాదిరిగా రాష్ట్రలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు విజిట్ చేస్తారని అన్నారు. రైతులు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా భూభారతి చట్టంతో భద్రత కల్పిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు.






