- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారి మొఖాల్లో ఆ చిరునవ్వును తుడిచేయాలి.. ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ముఖాల్లో ఆ చిరునవ్వును తుడిచేయాలని, భారత్ పై దాడి చేయాలంటే వంద సార్లు ఆలోచించేలా చర్యలు ఉండాలని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (AIMIM Leader, MP Asaduddin Owisi) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ముఖాల్లో ఆ చిరునవ్వును తుడిచేయాలని, భారత్ పై దాడి చేయాలంటే వంద సార్లు ఆలోచించేలా చర్యలు ఉండాలని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (AIMIM Leader, MP Asaduddin Owisi) అన్నారు.ఆదివారం బీహార్ (Bihar)లోని ఈస్ట్ చంపారన్ (East Champaran) లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అసద్.. పాకిస్థాన్ (Pakisthan) ఒక పెయిల్డ్ కంట్రీ (Failed Country) అని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినందుకు పాక్ పై భారత్ దీటుగా సమాధానం ఇవ్వాలని, ఈ విషయంలో ప్రధాని మోడీ(PM Modi) గట్టి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
అలాగే పాకిస్థాన్ ఇండియాపై దాడి చేసేందుకు ఎవరినైనా పంపించాలంటే 100 సార్లు ఆలోచించేలా చర్యలు ఉండాలని అన్నారు. అంతేగాక ఉగ్రదాడిపై పాక్ సిగ్గులేకుండా ఆధారాలు అడుగుతోందని, గతంలో వైమానిక దళ స్థావరంపై దాడి చేసినప్పుడు ఆధారాలు చూపిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పాకిస్థాన్ తన దేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి భారత ప్రజలను చంపుతారని ఎప్పటికీ అంగీకరించదని, భారత్ ను శాంతియుతంగా జీవించనివ్వదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పహల్గాం ఉగ్రదాడి విషయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఉగ్రదాడిలో తన భర్త ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి హిందూ- ముస్లిం విషాన్ని వ్యాప్తి చేసేవారికి చక్కని సందేశం ఇచ్చారని తెలిపారు. ఆమె తన భర్తను కోల్పోయానని, కానీ ముస్లింలు, కాశ్మీరీలపై హింసను కోరుకోవడం లేదని చెప్పిందని అన్నారు. ఆమె మాటలు భారత ప్రభుత్వం గుర్తుంచుకోవాలని, దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం ద్వేషాన్ని కాదు.. ప్రేమ, శాంతిని పెంపొందించాలని సూచించారు. భారత్ లో విషాన్ని వ్యాప్తి చేస్తున్న వారు పాకిస్థాన్ ముఖాల్లో చిరునవ్వులు తెస్తున్నారని గుర్తుంచుకోవాలని, ఆ క్రూరమైన వ్యక్తుల ముఖాల్లో చిరునవ్వులు తుడిచేయాలని తాను కోరుకుంటున్నట్లు ఓవైసీ వెల్లడించారు.






