Kishan Reddy: స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి : కిషన్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |

క్షేత్రస్థాయిలో మరింత బలపడటంతో పాటు స్థానిక సంస్థల(local bodies) ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

Kishan Reddy: స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : క్షేత్రస్థాయిలో మరింత బలపడటంతో పాటు స్థానిక సంస్థల(local bodies) ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో శనివారం కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ లో ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి.కె.అరుణలు హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు వర్క్ షాప్ కు హాజరయ్యారు. వర్క్ షాప్ లో చర్చించిన అంశాలను కిషన్ రెడ్డి వెల్లడించారు. సభ్యత్వ నమోదులో పురోగతి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరిపినట్లుగా తెలిపారు.

జిల్లాల్లో సమస్యలపై ఛార్జ్ షీట్, ప్రజాపోరాటాలు, రాజకీయ సభల నిర్వహణకు కార్యాచరణ చేపట్టాలని, డిసెంబర్ 10 వరకు రెట్టించిన ఉత్సాహంతో బూత్ స్థాయిలో మరిన్ని సభ్యత్వాలు పెంచాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల హామీలపై కాంగ్రెస్ వైఫల్యాలపై ఉద్యమించాలని నిర్ణయించామన్నారు. ఎంపీ డీకె.అరుణ మాట్లాడుతూ మహారాష్ట్ర ఫలితాల స్ఫూర్తిగా సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలన్నారు. క్షేత్రస్థాయిలో బలపడినప్పుడే.. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయొచ్చని తెలిపారు.

Next Story