- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shiva Sena Reddy : పతకాలతో తిరిగి రావాలి : శివసేనారెడ్డి
జాతీయ క్రీడ(National Sports)ల్లో రాణించి తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాక సగర్వంగా ఎగిరేలా పతకాలతో తిరిగి రావాలని రాష్ట్ర క్రీడాకారులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్(Telangana Sports Authority Chairman) శివసేనారెడ్డి(Shiva Sena Reddy) పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : జాతీయ క్రీడ(National Sports)ల్లో రాణించి తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాక సగర్వంగా ఎగిరేలా పతకాలతో తిరిగి రావాలని రాష్ట్ర క్రీడాకారులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్(Telangana Sports Authority Chairman) శివసేనారెడ్డి(Shiva Sena Reddy) పిలుపునిచ్చారు. జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ తరఫున స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ(Distribution of Sports Kits) చేశారు. ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ ఉత్తరాఖండ్ లో ఈనెల 28 నుంచి జరగబోతున్న జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న 22 క్రీడాంశాల్లో తప్పకుండా పతకాలు సాధించాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూతన క్రీడా పాలసీ తీసుకరానుండటం ద్వారా క్రీడలకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. జాతీయ క్రీడల్లో తెలంగాణ జట్లు పతకాల పంట పండించడంతో యువతరం క్రీడాకారులకు స్ఫూర్తిని అందించాలని సూచించారు. జాతీయ పతకాలు సాధించే క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. జాతీయ క్రీడల్లో పతకాలు తెచ్చిన వారికి అంతర్జాతీయ స్థాయి పోటీలకు మార్గం సుగమమవుతుందన్నారు. ప్రతి క్రీడాకారుడు రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావించి పోటీల్లో వంద శాతం ఫలితాల సాధనకు ప్రయత్నించాలని కోరారు.






