- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవాలి: గురుకుల కార్యదర్శి అలగు వర్షిణి
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను దేశంలోనే నంబర్‌వన్ సంస్థగా తీర్చిద్దిదే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారని, ఆ లక్ష్య సాధనకోసమే ఈ సంస్థాగత మార్పులు, చేర్పులు చేసినట్టు గురుకుల కార్యదర్శి డా. అలగు వర్షిణి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను దేశంలోనే నంబర్‌వన్ సంస్థగా తీర్చిద్దిదే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారని, ఆ లక్ష్య సాధనకోసమే ఈ సంస్థాగత మార్పులు, చేర్పులు చేసినట్టు గురుకుల కార్యదర్శి అలగు వర్షిణి స్పష్టం చేశారు. మన దేశంలోనే కాక అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో మెడికల్, ఇంజినీరింగ్ విభాగాల్లో అధిక సీట్లు సంపాదించేలా విద్యార్థులను తీర్చిద్దిదేందుకు వేర్వేరుగా క్యాంపస్ లను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఇలా ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ లో సీట్లు సాదించేందుకు చాలా విద్యా సంస్థలు ఎంపీసీ, బైపీసీ గ్రూపులను వేర్వేరుగా చేయడం జరిగిందని తెలిపారు.
ఇందులో భాగంగానే గౌలిదొడ్డి(బాలుర, బాలికలు), ఉప్పల్(బాలుర), కరీంనగర్(బాలికలు)- ప్రీమియర్ సీఓఈలను ఇంజనీరింగ్ క్యాంపస్ గా , మహీంద్రా హిల్స్(బాలికలు), ఫలక్ నుమా(బాలికలు), చిలుకూరు(బాలురు), క్యాంపస్ ను మెడికల్ క్యాంపస్ గా మార్చామని వెల్లడించారు. మెరిట్ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న కారణంగా గత ఏడాది కంటే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 600 సీట్లు అధికంగా పెంచమని ఆమె పేర్కొన్నారు. ఈ విద్యా సంస్థల్లో మెరిట్ ప్రాతిపదికన(90-95 శాతం) విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ విద్యా సంస్థలో నీట్ ఫ్యాకల్టీని మహీంద్రా హిల్స్ కు, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీని గౌలిదొడ్డికి మార్చామని తెలిపారు. ఈ విషయము తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు అపోహపడుతున్నారని అన్నారు. తమకు1.70 (ఒక లక్ష డెబ్భై) వేల మంది విద్యార్థులు తమకు సమానమని అందరి భవిష్యతు ఈ ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పారు.
గౌలిదొడ్డి, మహింద్ర హిల్స్ లో ఉన్న ఉత్తమమైన ఫ్యాకల్టీ లాగానే జిల్లాలోని అన్ని సీఓఈలలో ఉన్నారని, హైదరాబాద్ లో అమలు చేసే అన్ని రకాల సిలబస్, వారాంతపు పరీక్షలు, బోధన కుడా ఏకకాలంలో సమానంగానే నిర్వహిస్తున్నామని ఆమె తేల్చి చెప్పారు. ప్రత్యేక క్యాంపస్ ఏర్పాటులో ఉన్నా అపోహలను తొలగించుకోవాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. ఈ విషయంలో తమ పిల్లలను కలవరపాటుకు గురిచేయవద్దని కోరారు. విద్యార్థులకు తమకు కేటాయించిన విద్యాసంస్థలో చేరాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులు లేవనెత్తినా పలు అనుమానాలను కార్యదర్శి సావధానంగా ఎంతో ఓపికతో నివృత్తి చేశారు. దీనిపై ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని తెలిపారు. ప్రతి రోజు జూమ్ మీటింగ్ ద్వారా ప్రిన్సిపాల్ తో దిశానిర్దేశం చేస్తునట్టు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు.
- Tags
- Alagu Varshini






