- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకేసారి బంగారు తెలంగాణ చేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు: కోమటిరెడ్డి
ఒకేసారి బంగారు తెలంగాణ చేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఒకేసారి బంగారు తెలంగాణ చేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదని పదేళ్లలో అప్పులు చేసి వెళ్లి ఒకేసారి బంగారం చేయాలంటే సాధ్యమేనా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. గత ప్రభుత్వం హయాంలో పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి 3.78 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి తినే బియ్యమే పేదలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇవాళ నల్గొండ (Nalgonda) జిల్లాలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రూ. 10,160 కోట్లు, సన్నబియ్యం పథకానికి రూ. 5 వేల కోట్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు రూ.6 వేల కోట్లకు పైగా చెల్లించిందన్నారు.
రూ.11 వేల కోట్ల స్కామ్:
ధాన్యం నిల్వల విషయంలో రూ.11 వేల కోట్ల స్కామ్ జరిగిందని, కాంగ్రెస్ వచ్చాక కొంత మేర ధాన్యం రికవరీ చేయించామన్నారు. ఈ అంశంలో నల్గొండ జిల్లాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని డైరెక్టర్లు, ఎండీని అరెస్టు చేస్తే ఇటీవలే బెయిల్ వచ్చిందన్నారు. నల్గొండ జిల్లాలోనే రూ. 4 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని బకాయిలు చెల్లించి రెగ్యులర్ గా నడుపుకోవాలని చెప్పామన్నారు. చర్చల తర్వాత బకాయిలు చెల్లించే విధంగా ఒప్పుకున్నారని చెప్పారు. జిల్లాలో పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రచించామని తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా కృష్ణాజలాలు తెప్పిస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పెంచాలని అన్ని కేంద్రాలకు అవసరమైన లారీలు పెంచాలని అధికారులను ఆదేశించారు. రాత్రి, పగలు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపడంతో పాటు ధాన్యం ఎక్కువ వచ్చే గ్రామాలకు ఎక్కువ లారీలు పంపాలన్నారు. రోడ్లపై ధాన్యం పోయకుండా స్కూళ్లు, ఫంక్షన్ హాళ్ల వద్ద కేంద్రం పెట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లా పరిధిలో 2.30 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.






