తెలంగాణ అభివృద్ధికి మీ సహకారం కావాలి.. జపాన్ తెలుగు సమాఖ్య‌లో సీఎం రేవంత్ రెడ్డి

by Ramesh Goud |   (  Updated:2025-04-19 11:46:01  IST  )

తెలంగాణ అభివృద్ధికి ప్రవాస భారతీయులు తమ వంతు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోరారు.

తెలంగాణ అభివృద్ధికి మీ సహకారం కావాలి.. జపాన్ తెలుగు సమాఖ్య‌లో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అభివృద్ధికి ప్రవాస భారతీయులు తమ వంతు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోరారు. జపాన్ దేశ పర్యటన (Japan Tour)లో ఉన్న ఆయన.. టోక్యో నగరం (Tokyo City)లో జరిగిన "జపాన్ తెలుగు సమాఖ్య" (Japan Telugu Federation) సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జపాన్ తెలుగు సమాఖ్య ప్రతినిధుల, టోక్యోలో స్థిరపడిన తెలుగు వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణ అభివృద్ధి (Telangana Devolopment)పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణకు పరిశ్రమలు రావాలి.. పెట్టుబడులు పెరగాలి.. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం” అని చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి ప్రవాసులు(NRIs) ఎవరికి చేతనైనంత వారు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఎంతో ఉంటుందని చెప్పారు.

న్యూయార్క్‌లో హడ్సన్ రివర్ ఫ్రంట్, లండన్‌లో థేమ్స్, సియోల్ నగరంలో రివర్ ఫ్రంట్లతో పాటు టోక్యో నగరంలో వాటర్ ఫ్రంట్లను పరిశీలించామని, ఇదే కోవలో హైదరాబాద్ నగర అభివృద్ధి (Hyderabad City Devolopment)కి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు (Moosi River Front Project)ను చేపట్టామని తెలియజేశారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ (Delhi) నగరం స్తంభించిపోయే పరిస్థితులను గమనిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవలసిన అవసం ఉందని అన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ అభివృద్ధి సాధించడంలో అందరి సహకారం కావాలని రేవంత్ రెడ్డి కోరారు.

Next Story