జూన్ నుంచి "స్థానిక" సమరానికి సిద్ధం కావాలి : సూచనప్రాయంగా వెల్లడించిన సీఎం

by Muthe.Rajitha |   (  Updated:2025-05-29 14:04:17  IST  )

స్థానిక సంస్థల ఎన్నికలను జూలై.. ఆగస్టు నెలలలో పూర్తి చేద్దాము అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో వెల్లడించినట్లు సమాచారం.

జూన్ నుంచి స్థానిక సమరానికి సిద్ధం కావాలి : సూచనప్రాయంగా వెల్లడించిన సీఎం
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికలను జూలై.. ఆగస్టు నెలలలో పూర్తి చేద్దాము అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో వెల్లడించినట్లు సమాచారం.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ ని మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మేఘారెడ్డి, శ్రీహరి, పర్ణిక రెడ్డి, ఈర్లపల్లి శంకర్ తదితరులు హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. త్రిబుల్ ఐటీ ఏర్పాటు వల్ల పాలమూరు జిల్లా మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యేలు సీఎంకు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళదామా..!? అని అడిగితే అభివృద్ధి.. సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు... ప్రధాన రాజకీయ ప్రతిపక్ష పార్టీలు పలు కారణాలతో డీల పడిపోయి ఉన్నాయి.. ఎన్నికలకు వెళితే మనం స్థానిక సంస్థల ఎన్నికల అన్నింటిలో ఘనవిజయం సాధించే అవకాశాలు ఉంటాయని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లండి.. పెండింగ్ ప్రాజెక్టులు, ఎట్టిపోతల పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపడతాం.. మహబూబ్ నగర్ జిల్లాకు మంజూరి అయిన ట్రిపుల్ ఐటీ ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిద్దాం.. జూన్ మొదటి లేదా రెండవ వారం లోపు క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేద్దామని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు తెలిపారు.

సాధ్యమైనంత త్వరలో నాలుగు ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలలో వేసి.. మిగతా నాలుగు ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు జూన్ రెండు లేదా మూడవ వారం లోపు రైతు భరోసా డబ్బులు వేసేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. జూన్ చివరి వారం నుండి వరుసగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మునిసిపాలిటీ షెడ్యూలు ప్రకటించి.. నోటిఫికేషన్ విడుదల చేసి జూలై చివరి వారం నుండి.. ఆగస్టు మొదటి వారంలోపు ఎన్నికలను పూర్తి చేసేందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చెయ్యాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు.

Next Story